కొయ్యలగూడెంలో కురుస్తున్న భారీ వాన

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొయ్యలగూడెంలో బుధవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి కురిసిన కుండపోత వర్షంతో రహదారులన్నీ వరదల్లో మునిగిపోయాయి. రాబోయే రెండు రోజుల పాటు ఇదే అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతులు, వ్యవసాయ కూలీలు పొలాల్లో అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్