పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం రూ. 1,100 కోట్లు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం ఏలూరు జిల్లా వేలేరుపాడులో జరిగే కార్యక్రమంలో నిర్వాసితులకు పరిహారం చెక్కులను అందజేయనున్నారు. జనవరిలో మిగిలిపోయిన నిర్వాసితులతో పాటు 41.15 కాంటూర్ పరిధిలోని మరికొన్ని గ్రామాలకు ఈ పరిహారం అందనుంది.