రేలంగిలో అశ్లీల నృత్యాలు: ఐదుగురి అరెస్ట్, మరికొందరి కోసం గాలింపు

ఇరగవరం మండలం రేలంగిలో ఇటీవల జరిగిన అశ్లీల నృత్యాల కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. నిర్వాహకులైన టిడిపి నాయకులు పసుపులేటి కుమారస్వామి, పసుపులేటి రామాంజనేయులు, యర్రంశెట్టి రవి, షేక్‌ ఇస్మాయిల్, షేక్‌ ఖాదర్‌లను శుక్రవారం ఎస్సై సతీష్ అరెస్టు చేశారు. మరికొందరు పరారీలో ఉన్నారని, మరో పది మందిని అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వీఆర్వో పసుపులేటి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్