జీలుగుమిల్లి సర్కిల్లో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేయనున్నట్లు CI బి. వెంకటేశ్వరరావు ప్రకటించారు. జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, టీ.నర్సాపురం పరిధిలో ముందస్తు అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహించొద్దని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.