AP: రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రేషన్ కార్డులో కొన్ని వివరాలు తప్పుగా ప్రింట్ అవుతున్నాయి. విజయవాడలోని లబ్బీపేట 19వ డివిజన్‌లో డీలర్ 0684244కు సంబంధించి వెయ్యికిపైగా కార్డులు ఉన్నాయి. ఇటీవల ఆ డీలర్ ఫకీరుగూడెంలో కార్డులు పంపిణీ చేశారు. అయితే కార్డులో ఫకీరుగూడెం కాకుండా పాకీగూడెం అని ముద్రించారు. దాంతో స్థానికులు మండిపడుతున్నారు. ప్రాంతం పేరును మార్చి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.