పతనమైన పెసర ధర

AP: ఉల్లి, టమాటా, చీనీ, అరటి, సజ్జ, బంతిపూలకు కనీస మద్దతు ధర లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. ధరలు పతనమవుతున్న పంటల జాబితాలో తాజాగా పెసర చేరింది. 2024-25 సీజన్‌లో కనీస మద్దతు ధర క్వింటాకు రూ.8,558 కాగా.. మార్కెట్‌లో రూ.5,000 - రూ.5,200కు మించి పలకలేదు. 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో పెసరకు మద్దతు ధర క్వింటా రూ.8,768గా కేంద్రం ప్రకటించింది. కానీ మార్కెట్‌లో క్వింటా పెసర రూ.2 వేల నుంచి రూ.2,500 మించి పలకడం లేదు. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్