AP: కూటమి ప్రభుత్వంపై ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో దుర్మార్గమైన ప్రభుత్వ పాలన కొనసాగుతోందన్నారు. ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఉల్లి రైతులకు మద్దతు ధర కల్పించాలని, ఇప్పటివరకు ప్రభుత్వం మద్దతు ధరతో కేజీ ఉల్లి కూడా కొనలేదని ఆరోపించారు. కనీస మద్దతు ధర రూ.1200తో ఉల్లి కొనుగోలు చేయాలని కోరారు. ఈ మేరకు ఉల్లి పంటను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.