AP: కడప ఎమ్మెల్యే మాధవిపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన కేసులో కడప వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సెప్టెంబర్ 25న ఎమ్మెల్యే భర్త శ్రీనివాసులు రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఆ అసభ్య పోస్టులను సోషల్ మీడియాలో షేర్ చేసిన మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పీఏ ఖాజాను పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి కడపకు తీసుకొచ్చారు. జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో ఆయనను విచారిస్తున్నారు.