వైసీపీకి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గుడ్ బై?

AP: శ్రీకాకుళం జిల్లా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు త్వరలో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు, సమావేశాలకు దూరంగా ఉంటున్న ధర్మాన, తన అనుచరులతో ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం. అయితే, దీనిపై ఆయన నుంచి గానీ, వైసీపీ నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆయన పార్టీని వీడితే వైసీపీకి ఇది పెద్ద షాక్ తగిలినట్లే.

సంబంధిత పోస్ట్