కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సెటైర్లు

AP: వైసీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూటమి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. కూటమి పాలన అంటూ ఏమీ లేదు.. ఆది కేవలం టీడీపీ పాలనే అన్నారు. టీడీపీ వాళ్ల ఒక్కరి పైనే పాపం పడిపోకుండా.. కూటమి అని చెప్పుకుంటున్నారు. కానీ, సమాజంలో ఉండే అట్టడుగు వర్గాల కోసం పని చేసే పార్టీ వైసీపీ మాత్రమే అన్నారు. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా రాజ్యాంగబద్ధంగా పని చెయ్యాల్సిందే.. కానీ, రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పాలన జరగడం లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్