కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ వాట్సాప్ చాట్ లీక్!

AP: కల్తీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ చెబితేనే నకిలీ మద్యం తయారు చేశానని నిందితుడు జనార్ధన్ రావు చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసుకు తనకు సంబంధం లేదని జోగి రమేష్ ఖండించి, సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో, తాజాగా జనార్ధన్ రావుతో జోగి రమేష్ జరిపిన వాట్సాప్ చాట్ వెలుగులోకి వచ్చింది. దీంతో కల్తీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ పాత్రపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్