AP: రాష్ట్ర ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే సివేరి సోమా కుమారుడు సురేశ్ కుమార్‌కు కారుణ్య నియామకం కింద గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది. జోన్-1లో డిప్యూటీ తహసీల్దార్‌గా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 3(b) ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లో ఈ నియామకం జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా, 2018 సెప్టెంబర్ 28న నక్సల్స్ కాల్పుల్లో సివేరి సోమా మరణించారు.