బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత దంపతులు (వీడియో)

AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల్లో చేరికలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన పోతుల సునిత దంపతులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరారు. నడ్డా వారికి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. గతంలో వైసీపీ నుంచి గెలిచిన, ఓడిపోయిన పలువురు నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి కూటమి పార్టీలలో చేరుతున్నారు.

సంబంధిత పోస్ట్