AP: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎమ్మెల్సీ నాగబాబు జనసేన ప్లీనరీలో చేసిన వ్యాఖ్యలపై ఆయన తాజాగా కౌంటర్ ఇచ్చారు. 'ఎవడో కర్మ అంటే నాకేంటి, ఎవడో గడ్డిపరక వర్మ అంటే నాకేంటి' అని వ్యాఖ్యానించారు. 'వర్మ అంటే ఏమిటో పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి తెలుసు. చంద్రబాబు, లోకేష్ పై నాకు ఎంత ప్రేమ ఉందో వాళ్లకి తెలుసు. ఎవరో ఏదో అన్నారని నేను లక్ష్మణ రేఖ దాటను' అని పేర్కొన్నారు.