AP: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 'స్త్రీ శక్తి పథకం' విజయవంతంగా అమలవుతోందని తెలిపారు. ఈ పథకానికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు, ప్రభుత్వం కొత్తగా 1,500 బస్సులు కొనుగోలు చేయడంతో పాటు, 750 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చామన్నారు. ఈ 750 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో విశాఖ, కాకినాడ, VJD, GNTR, తిరుపతి నగరాల్లో తిరుగుతాయి. అదనంగా మరో 1,500 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టే ప్రణాళిక ఉందని, పాత బస్సుల స్థానంలో దశలవారీగా ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తామని మంత్రి తెలిపారు.