ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత బస్సు ప్రయాణంలో మహిళల ఆధిపత్యం పెరిగిందని టికెట్ ఉన్న పురుషులను కూడా బస్సుల నుండి దించుతున్నారని ఆరోపించారు. అలాగే వైజాగ్‌లో ఏర్పాటు చేయనున్న గూగుల్ డేటా సెంటర్ ద్వారా రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయనే వార్తలను కొట్టిపారేశారు. 2, 3వేలలో మాత్రమే ఉద్యోగాలు వస్తాయని దాని వల్ల ఎంత బ్రాండ్ పెరుగుతుందనేదే ముఖ్యమని వివరించారు.