దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలు

AP: దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాల పంపిణీకి సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి. విజయవాడకు చెందిన ఆర్ఎం మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ టెండరు దక్కించుకుంది. ఈ సంస్థ ‘హీరో’ కంపెనీ మోటారు వాహనాలను దివ్యాంగులకు అందజేయనుంది. ఒక్కో వాహనం ఖరీదు రూ.1.07 లక్షలు ఉండగా.. ప్రభుత్వం 100 శాతం రాయితీతో అందజేయనుంది. 2025-26 ఏడాదిలో నియోజకవర్గానికి 10 మంది చొప్పున మొత్తం 1,750 లబ్ధిదారులకు వాహనాలు అందించనున్నారు.

సంబంధిత పోస్ట్