AP: విజయవాడ పేరులోనే విజయం ఉందని, చరిత్ర రాయాలన్నా, సృష్టించాలన్నా విజయవాడతోనే సాధ్యమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. తెలుగు భాష అభివృద్ధికి వెంకయ్య నాయుడు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. విజయవాడ ఉత్సవ్‌లో లోకేష్ మాట్లాడుతూ.. "ఇప్పటి వరకు దసరా ఉత్సవాలు అంటే దేశం మొత్తం మైసూరు ఉత్సవాలు గురించి మాట్లాడే వారు. ఇక నుంచి దసరా ఉత్సవమంటే విజయవాడ గుర్తుండేలా.. ఈ ఉత్సవాల గురించి మాట్లాడుకునేలా, ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి." అని అన్నారు.