అనకాపల్లి జిల్లాలో గిరి నాగు హల్‌చల్.. స్నేక్ క్యాచర్‌పై రివర్స్ ఎటాక్ (వీడియో)

AP: అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ కాలువ వద్ద భారీ గిరి నాగు ప్రత్యక్షమై స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. గ్రామస్తులు పరుగులు తీయగా, స్నేక్ క్యాచర్ కృష్ణ అక్కడికి చేరుకొని పామును పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో నాగుపాము రివర్స్ ఎటాక్ చేయడానికి యత్నించగా, కృష్ణ అప్రమత్తంగా వ్యవహరించాడు. సుమారు రెండు గంటల పాటు శ్రమించిన తర్వాత చివరికి గిరి నాగును సురక్షితంగా బంధించగలిగారు.

సంబంధిత పోస్ట్