AP: కృష్ణా జిల్లా పామర్రు మండలం పెదమద్దాలిలో విషాదం చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న గుమ్మడి లావణ్య అనే బాలిక జ్వరంతో ఆసుపత్రిలో చేరింది. అయితే జ్వరానికి చికిత్స పొందుతున్న ఒక్కసారిగా సృహ తప్పి పడిపోయింది. వెంటనే పరీక్షలు చేసిన వైద్యులు బాలిక గుండెపోటుకు గురై మృతి చెందినట్లు వెల్లడించారు. దీంతో తల్లిదండ్రులు ఘోరంగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.