ఉధృతంగా గోదావరి, కృష్ణా నదులు (వీడియో)

AP: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి, కృష్ణా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్ ఫ్లో 10.88 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్, ఔట్ ఫ్లో 5.09 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్