AP: నకిలీ మద్యం వ్యవహారం ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. దీని ప్రభావంతో ఎక్సైజ్‌శాఖ ఆదాయం గణనీయంగా తగ్గింది. నకిలీ మద్యం నివారణకు ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాలు, బార్లలో నాణ్యమైన మద్యం అమ్మేలా నిబంధనలు అమలులోకి తెచ్చింది. ఇకపై క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేశాకే మద్యం అమ్మేలా నిబంధన పెట్టింది ఎక్సైజ్‌శాఖ. ‘ఎక్సైజ్ సురక్షా యాప్’ ద్వారా మద్యం సీసాపై కోడ్ స్కాన్ చేయాలని నిబంధన విధించింది.