డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. రూ.లక్ష రుణం!

AP: కూటమి ప్రభుత్వం త్వరలో ‘ఎన్టీఆర్‌ కల్యాణలక్ష్మి’ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళల కుమార్తెల వివాహాలకు ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ పథకంలో రూ.10 వేల నుంచి రూ. 1లక్ష వరకు రుణం తీసుకోవచ్చు. దీనికి 4% వడ్డీ ఉంటుంది, గరిష్ఠంగా 48 వాయిదాలలో తిరిగి చెల్లించాలి. లగ్న పత్రిక, ఈవెంట్ పత్రాలు సమర్పించాక, పెళ్లి వివరాలు పరిశీలించి, నగదును నేరుగా సభ్యురాలి ఖాతాలో జమ చేస్తారు.

సంబంధిత పోస్ట్