AP: వాహనదారులకు ఒక శుభవార్త. పాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. మోటార్ వాహనాల చట్టానికి సవరణలు చేస్తూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఆమోదం లభించడంతో పాత వాహనాలపై ఉన్న గ్రీన్ ట్యాక్స్ రూ.20 వేల నుండి రూ.3 వేలకు తగ్గనుంది. ఈ నిర్ణయం పాత వాహన యజమానులకు ఆర్థిక భారం తగ్గిస్తుందని భావిస్తున్నారు.