AP: పేదలకు ఇళ్ల నిర్మాణ అనుమతులపై కూటమి ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామాల్లోని పేద, మధ్య తరగతి ప్రజలకు రూపాయికే పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయించారు. 50 చదరపు గజాలు మరియు జీ+1 (గ్రౌండ్+ఒక అంతస్తు) లోపు భవన నిర్మాణాలకు ఈ అవకాశం వర్తిస్తుంది. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అప్‌లోడ్ చేసి, కేవలం ఒక్క రూపాయి మాత్రమే చెల్లిస్తే అనుమతి లభిస్తుంది.