ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధి దృష్ట్యా మరో కీలక అడుగు వేసింది. పచ్చళ్ళు, పిండివంటలు, పశువుల దాణా తయారీ వంటి సూక్ష్మ ఆహార పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలు 10 శాతం పెట్టుబడి పెడితే మిగిలిన మొత్తాన్ని పీఎం-ఎఫ్ఎంఈ పథకం ద్వారా ప్రభుత్వం రుణంగా అందిస్తుంది. దీంతో పాటు యూనిట్ల ఖర్చుపై గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు 35 శాతం రాయితీ పొందొచ్చు.