AP: ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ నిరాశే ఎదురైందని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. గురువారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఉద్యోగుల డీఏ, ఐఆర్, పీఆర్‌సీలపై చర్చించకపోవడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని సీఎస్ విజయానంద్ బుధవారం నిర్వహించినా.. ఇవాళ కేబినెట్ భేటీలో చర్చించకపోవడం అన్యాయమన్నారు.