కార్మికుల పని గంటలు పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికుల పని గంటలను 8 నుంచి 10 గంటలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది నిన్నటి నుంచే అమల్లోకి వస్తుందని కార్మిక శాఖ కార్యదర్శి శేషగిరి బాబు తెలిపారు. అయితే వారం మొత్తంలో పని గంటలు 48 దాటితే ఓటీ కింద అదనపు మొత్తాన్ని చెల్లించాలని ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని సవరించారు. మరోవైపు ఐదుగురు కంటే ఎక్కువ మంది మహిళలుంటే వారిని రాత్రి వేళ డ్యూటీలకు అనుమతించనున్నారు.

సంబంధిత పోస్ట్