రుషికొండ భవనాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

AP: విశాఖలోని రుషికొండలో గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన భవనాలను ఎలా వినియోగించుకోవాలనే దానిపై కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు తాజాగా ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా మంత్రులు దుర్గేష్‌, పయ్యావుల కేశవ్‌, DBV స్వామిని నియమించింది. రుషికొండలో ఖాళీగా ఉన్న భవనాలను సరైన విధంగా వినియోగించే మార్గాలపై అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేయాలని సూచించింది.

సంబంధిత పోస్ట్