AP: నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే 4 కొత్త రెవెన్యూ డివిజన్లను సర్దుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిర కేంద్రాలుగా కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కైకలూరు సెగ్మెంట్‌ను కృష్ణా జిల్లాలో, గన్నవరం, నూజివీడులను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలనే ప్రతిపాదనలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోంది. పెనమలూరు కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటుపై పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనలపై చర్చించి బుధవారం ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది.