AP: ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో జలాశయాలను నింపి, భూగర్భ జలాలను పెంచే బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వర్షాకాలం తర్వాత భూగర్భ జలాలు మూడు మీటర్ల వరకు ఉండేలా చూడాలని ఆయన సూచించారు. ఈ ఏడాది 2.1% వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ, గతేడాదితో పోలిస్తే భూగర్భ జలాలు 1.25 మీటర్లు పెరిగాయని చెప్పారు. నీటిని సమర్థంగా నిర్వహిస్తే కరవు అనే మాట ఉండదని ఆయన అన్నారు.