నూతన బార్ పాలసీపై మంత్రుల బృందం సమావేశం

ఏపీలో కొత్త బార్ పాలసీపై మంత్రులు కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవికుమార్ తదితరులు సమావేశమై శుక్రవారం చర్చించారు. ప్రస్తుత పాలసీ ఆగస్టు 31తో ముగియనుండటంతో, వర్చువల్ సమావేశంలో కొత్త పాలసీ రూపకల్పనపై చర్చ జరిగింది. పర్యాటక అభివృద్ధికి అనుకూలంగా ఉండేలా పాలసీ రూపొందించనున్నారు. ప్రస్తుత పాలసీలో ఏపీలో 840 స్టాండ్‌లోన్ బార్లు, 50 స్టార్ హోటల్స్, మైక్రోబ్రూరీలకు లైసెన్సులు మంజూరైనట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్