ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పి. వి రమేష్ శనివారం గుంటూరులో జరిగిన చేయూత ఫౌండేషన్ ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతూ సాంఘిక పెట్టుబడి బలంగా ఉన్న దేశాలే వేగంగా అభివృద్ధి చెందుతాయని, భారతదేశంలో ప్రజలను కులాలు, మతాల వారీగా విభజించడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించడానికి చేయూత ఫౌండేషన్ వంటి సంస్థలు కీలక పాత్ర పోషించాలని, ప్రతిభావంతులైన పేదలకు నైపుణ్య విద్యను అందించాలని ఆయన కోరారు.