గుంటూరు నగర పాలక సంస్థ ప్రజారోగ్య, ఇంజనీరింగ్ కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఆదివారం గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ వద్ద గల పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ నందు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో, ఐఎంఏ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేయర్ సూచించారు.