గుంటూరు: విచారణ కమిటీ నిర్ణయాలు పారదర్శకంగా లేవు

గుంటూరు జిజిహెచ్ లో కాంట్రాక్టు పద్ధతిలో ఈసీజీ టెక్నీషియన్ గా పనిచేస్తున్న నందిగం నాగరాజును ఉద్యోగం నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ నేతలు శనివారం ఆసుపత్రి వద్ద ధర్నా చేపట్టారు. నాగరాజుపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసి, ఆకాశ రామన్న ఉత్తరాలు రాసి ఉద్యోగం నుంచి తొలగించారని నేతలు ఆరోపించారు. ఉద్యోగం నుంచి తొలగించిన విధానంలో విచారణ కమిటీ పారదర్శకంగా వ్యవహరించలేదని వారు విమర్శించారు.

సంబంధిత పోస్ట్