గుంటూరు: గతంలో జరిగిన ఒప్పందాలకు అనుగుణంగా న్యాయం చేయాలి

తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ జొమాటో గిగ్ వర్కర్లు శనివారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. గతంలో జరిగిన ఒప్పందాలను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే, ప్రతి శని, ఆదివారాల్లో సమ్మె చేపడతామని కార్మికులు హెచ్చరించారు. తమ న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారం కోసం ఈ ఆందోళన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్