గుంటూరు: వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదివారం మాట్లాడుతూ, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రకాశం బ్యారేజీ వద్ద 5.67 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉందని, రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశామని తెలిపారు. మరిన్ని వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలో చేపలు పట్టడం, పశువులను వదలడం వంటి పనులు చేయవద్దని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్