గుంటూరు: హిందువుల మనోభావాలను షర్మిల దెబ్బతీస్తున్నారు

గుంటూరులో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్, షర్మిల హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. దళితవాడల్లో దేవాలయాలు ఎవరు కట్టమన్నారంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ముస్లింలు కట్టిన మసీదులు, క్రిస్టియన్లు కట్టిన చర్చిల గురించి మాట్లాడే చేతకానితనం ఉన్న షర్మిల, హిందూ దేవాలయాల గురించి మాట్లాడటం సిగ్గుచేటని జయప్రకాష్ అన్నారు.

సంబంధిత పోస్ట్