పొన్నూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఘనంగా జరిగాయి. జనసేన జాయింట్ సక్రెటరీ దేశంశెట్టి సూర్య ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో అంగన్వాడి విద్యార్థులకు పలకలు పంపిణీ చేసి, కేక్ కట్ చేశారు. అనంతరం రోడ్డు పక్కన మొక్కలు నాటి, పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆకుల గోపి, పోడకట్ల ప్రసాద్, గడ్డెమూరి చందు, యాజ్ భాష, ధనుంజయ్, గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్