పొన్నూరు వ్యర్ధాలను తొలగించాలి.. రైతులు వేడుకోలు

చేబ్రోలు గ్రామంలో హిందూ స్మశాన వాటిక మీదుగా వ్యవసాయ భూములకు వెళ్లే డొంక రోడ్డు దుర్వాసనతో దుర్భరంగా మారింది. గ్రామపంచాయతీ అధికారులు డంపు యార్డుగా వేసిన వ్యర్థాలు రోడ్లపైకి చేరి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయని రైతులు ఆదివారం తెలిపారు. సుమారు అర దశాబ్ద కాలంగా ఈ సమస్య కొనసాగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్