పొన్నూరులో యూరియా కోసం రైతులు పడిగాపులు

పొన్నూరు మండలం చింతలపూడి సొసైటీ వద్ద శుక్రవారం రైతులు యూరియా కోసం తెల్లవారుజాము 5 గంటల నుండి బారులు తీరి నిరీక్షించారు. సొసైటీకి కేవలం 440 బస్తాలు మాత్రమే రావడంతో, సరిపడా స్టాకు లేదని సిబ్బంది తెలిపారు. కనీసం ఒక్క బస్తా అయినా ఇవ్వాలని రైతులు పట్టుబట్టారు. మండలంలోని ఇతర సహకార సంఘాలలోనూ ఎరువుల స్టాకు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్