రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి

పొన్నూరు మండలం కసుకర్రు, చింతలపూడి గ్రామాలలో మంగళవారం 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం జరిగింది. గుంటూరు లాం ఫామ్ డాట్ సెంటర్ కోఆర్డినేటర్ వినోద్ హాజరై రైతులతో మాట్లాడి, బీపీటీ 52 04 వరిలో పురుగులు, తెగుళ్లు ఎక్కువగా ఉన్నాయని, ప్రత్యామ్నాయంగా బిపిటి 27 84 అనే కొత్త వరి రకం సాగు చేయాలని సూచించారు. ఈ కొత్త రకం 135-140 రోజుల్లో కోతకు వస్తుందని, తుఫానులకు తట్టుకునేదని రైతులకు వివరించారు.

సంబంధిత పోస్ట్