పొన్నూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. 'వినియోగదారుడా మేలుకో జీఎస్టీ ఫలాలు అందుకో' అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో, నూతన సమీకరణలు, వాటి ఉపయోగాలపై జాయింట్ కమిషనర్ (స్టేట్ టాక్స్) గుంటూరు, నోడల్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఎస్. ప్రసాద్ రావు వివరించారు. మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు, మెప్మా సిబ్బంది, అడ్మిన్ సెక్రటరీస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.