పొన్నూరు పట్టణంలోని 22వ వార్డులో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా, మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిబ్బంది మొక్కలను తొలగించి పరిసరాలను పరిశుభ్రపరిచారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలమని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సిబ్బంది వచ్చినప్పుడు వ్యర్థాలను వారికి అందించాలని కోరారు.