పొన్నూరు: యూరియా ఉన్న ఇవ్వటం లేదని రైతులు ఆందోళన

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లె గ్రామంలోని సహకార పరపతి సంఘం వద్ద సోమవారం సొసైటీ సిబ్బంది యూరియా రైతులకు ఇవ్వకుండా తాళాలు వేసుకొని వెళ్లిపోయారని రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం సొసైటీలకు యూరియా సరఫరా చేసినప్పటికీ, సిబ్బంది నిర్లక్ష్యం వహించి, సవాలక్ష కారణాలు చెప్పి యూరియాను రైతులకు అందించడం లేదని వారు ఆరోపించారు. పదుల సంఖ్యలో రైతులు ఉదయం నుంచి ఎదురుచూస్తున్నా సిబ్బంది నిర్లక్ష్యం చేయటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్