పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఆదివారం పొన్నూరు మండలం వడ్డెముక్కల గ్రామంలో అంకమ్మతల్లి సి. హెచ్. సి గ్రూప్ సభ్యులకు రైతు సేవ కేంద్రం వద్ద వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి పార్టీల నాయకులతో కలసి "కిసాన్ డ్రోన్" (డ్రాగో డ్రోన్స్ క్రిషి 3 ప్రో) ను అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 800కి పైగా గ్రామస్థాయి కిసాన్ సమైక్యలను ఏర్పాటు చేసి రైతులకు డ్రోన్స్ అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.