పొన్నూరు: ఎమ్మెల్యే ధూళిపాళ్ల అమ్మవారికి ప్రత్యేక పూజలు

చేబ్రోలు మండలం శలపాడు గ్రామంలో దసరా నవరాత్రుల సందర్భంగా ఆదివారం శలపాడు భవాని మణికంఠ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు శాసనసభ్యులు, సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్