గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో గురువారం రాత్రి మాల ఐక్యత సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అంబేద్కర్ సెంటర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాల నాయకుడు రేగులగడ్డ వాసు మాట్లాడుతూ, ప్రభుత్వం వర్గీకరణ పేరుతో మాలలకు అన్యాయం చేస్తుందని, దీనివల్ల అన్ని రంగాలలో నష్టం జరుగుతుందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.