పొన్నూరు: వీఆర్వోలు విధిగా పనిచేయాలి: తహసిల్దార్

పొన్నూరు తహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం తహసిల్దార్ మహమ్మద్ జియావుల్ హక్ వీఆర్ఓలతో సమావేశం నిర్వహించారు. స్మార్ట్ కార్డులు, అన్నదాత సుఖీభవ కార్డులు, కౌలు రైతు కార్డులు, కుల ఆదాయ తదితర సర్టిఫికెట్లను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల వారీగా పెండింగ్ లో ఉన్న అంశాలపై ఆరా తీశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్