గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన పి.జి.ఆర్.ఎస్. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మాధవి 11 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. వీటిలో రెవిన్యూకు 7, ఆర్.డి.ఏ.కు 2, సర్వేకు 2 ఫిర్యాదులున్నాయి. వాటిని పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు పంపి సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.